- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రజలకు అలర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. నైరుతి, ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం కేంద్రం నుంచి, ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములతో వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు చెట్ల కింద నిలబడరాదని వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచనలు చేశారు. అటు శుక్రవారం రాష్ట్రంలో 43-44°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి, పోలవరం, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు మండలాల్లో ఎండలు దంచికొట్టనున్నాయని వెల్లడించారు.






