- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP: ‘సూపర్ సిక్స్’ను సూపర్ హిట్ చేశాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ (Annadatha Sukhibhava) పథకంలో భాగంగా కడప (Kadapa) జిల్లా చిన్నదాసరిపల్లి (Chinnadasaripally)లో ఆయన రెండో విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశామన్నారు. నాడు ఇచ్చిన హామీల అమలు సాధ్యమా అని అందరూ అనుకున్నారని.. కానీ సూపర్ సిక్స్ పథకాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేసి విజయవంతంగా నెరవేర్చామన్నారు. రైతన్నకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పామని, ఇప్పటికే మొదటి విడతలో రైతుల అకౌంట్లలో రూ.7 వేలు జమ చేశామన్నారు. ఇవాళ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు కూడా జమ చేశామని తెలిపారు. 46.85 లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మూడో విడత రూ.6 వేలు కూడా రైతుల అకౌంట్లలో వేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా.. ఇచ్చిన ప్రతీ హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు.






