తెలంగాణలో సాగునీటి ప్రాజెక్ట్‌లకు అంకురార్పణ చేసిందే చంద్రబాబు: ఏపీ విప్ కాల్వ శ్రీనివాసులు

by Ajay Maddhiboyina |

చంద్ర‌బాబు కాళేశ్వ‌రం ప్రాజెక్టును అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని, ప్రాజెక్టును ఆపేందుకు 7 ఉత్త‌రాలు రాశార‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్ట్‌లకు అంకురార్పణ చేసిందే చంద్రబాబు: ఏపీ విప్ కాల్వ శ్రీనివాసులు
X

దిశ, వెబ్ డెస్క్: చంద్ర‌బాబు కాళేశ్వ‌రం ప్రాజెక్టును అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని, ప్రాజెక్టును ఆపేందుకు 7 ఉత్త‌రాలు రాశార‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. బ‌న‌క‌చ‌ర్ల‌ను అడ్డుకుని తీరుతామ‌ని ఆయ‌న స‌వాల్ చేశారు. కాగా ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్యే, ఏపీ విప్ కాల్వ శ్రీనివాసులు స్పందించారు. తెలంగాణ అభివృద్ధిలో చంద్ర‌బాబు పాత్ర కీలకం అని అన్నారు. తెలంగాణ‌లో సాగునీటి ప్రాజక్టుల‌కు అంకురార్ప‌ణ చేసిందే చంద్ర‌బాబు అని వ్యాఖ్యానించారు.

హైద‌రాబాద్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆర్థిక‌రాజ‌ధానిగా ఉందంటే దానికి కార‌ణం చంద్ర‌బాబు అని చెప్పారు. తెలంగాణ‌ను దొర‌ల పాల‌న నుండి ప్ర‌జ‌ల తెలంగాణగా మార్చిన ఘ‌న‌త తెలుగుదేశం పార్టీకే ద‌క్కుతుంద‌న్నారు. లోకేష్ బ‌నక‌చ‌ర్ల క‌డితే తెలంగాణ‌కు న‌ష్టం ఏంటి అని ప్ర‌శ్నిస్తే హ‌రీష్ రావు ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. రాజకీయ ప్ర‌యోజ‌నాల కోసమే హ‌రీష్ రావు, బీఆర్ఎస్ నాయ‌కులు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌న్నారు. రెండు రాష్ట్రా విశాల ప్ర‌యోజ‌నాల‌ను ఆలోచించి చంద్ర‌బాబు బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుకు అంకురార్ప‌ణ చేశార‌న్నారు. హ‌రీష్ రావు త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

Next Story