AP | స్పౌజ్ కేటగిరిలో సచివాలయ ఉద్యోగుల బదిలీలు

by Thanuru Gopichand |

గ్రామ సచివాలయ ఉద్యోగులు (Secreteriat Employees) స్పౌజ్ కేటగిరీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ (Trasnfer) అయ్యేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది

AP | స్పౌజ్ కేటగిరిలో సచివాలయ ఉద్యోగుల బదిలీలు
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రామ సచివాలయ ఉద్యోగులు (Secreteriat Employees) స్పౌజ్ కేటగిరీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ (Trasnfer) అయ్యేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు గ్రామ సచివాలయాల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ (Katamneni Bhaskar) సోమవారం ఆదేశాలను జారీ చేశారు. నెలాఖరులోగా బదిలీ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. క్రమశిక్షణ చర్యలకు గురైన ఉద్యోగులు, విజిలెన్స్ కేసులు ఉన్నవారి అభ్యర్థన తీసుకొన్నారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అర్హులైన వారు ఆన్లైన్ లో దరఖాస్తు (Online Application) చేసుకోవాలని సూచించారు. భార్యాభర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్, కో-ఆపరేటివ్, ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసే వారు బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అయితే ఉద్యోగుల్లోని భర్తా లేదా భార్య ఎవరో ఒకరు ప్రైవేటు ఉద్యోగి అయితే ప్రక్రియకు అర్హులు కాదని స్పష్టం చేశారు. దరఖాస్తు సమయంలో ఉద్యోగులు కావాల్సిన మండలాలు, మున్సిపాలిటీలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి ఎంపిక ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియలో నిర్ణీత సచివాలయం కేటాయించనున్నట్లు వెల్లడించారు. మెరిట్ ఆధారంగా సీరియల్ గా బదిలీలు ఉంటాయని తెలిపారు.

Next Story