- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rain effect: ఏపీలో గాలి వాన బీభత్సం .. బెజవాడలో కుండపోత
ఏపీలో అకాల వర్షం ముంచెత్తింది. ఎన్టీఆర్, కృష్ణా, గోదావరి జిల్లాల్లో గాలివానలు బీభత్సం సృష్టించాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో అకాల వర్షం ముంచెత్తింది. ఎన్టీఆర్, కృష్ణా, గోదావరి జిల్లాల్లో గాలివానలు బీభత్సం సృష్టించాయి. విజయవాడలో (Vijayawada)వర్షం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో నీరు ఇంటి లోపలకూ ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కృష్ణా జిల్లా, కంకిపాడులో ఈదులుగాలులకు పలు హోర్డింగ్‌లు, చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షాల ధాటికి పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాలివానల కారణంగా చెట్లు, విద్యుత్ తీగలు నేలకొరిగిన ఘటనలు చోటుచేసుకోగా, కొన్నిచోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ భూములు నీట మునిగాయి. ముఖ్యంగా నూతనంగా సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలు నష్టపోయామని రైతులు చెబుతున్నారు.
ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆకాల వర్షాలు కురవడంతో అక్కడక్కడ నీట్ అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఇబ్బంది పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు, రాజమండ్రిలో ఆదివారం ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండి ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పట్టణంలో జనజీవనం స్తంభించిపోయింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురకురుస్తుండడంతో ఆయా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. పలు ప్రాంతాల్లో పిడుగులు (Thunders) పడే అవకాశం ఉందన్నారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు చేశారు. గాలివానకు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించి విద్యుత్ సరఫరా చేయాలన్నారు.






