AP | నేడు మావోయిస్టుల నిరసన దినం

by Thanuru Gopichand |   (  Updated:2025-11-23 02:16:15  IST  )

మారేడుమిల్లి (Maredumilli)అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లను ఖండిస్తూ నేడు నిరసన దినం పాటించాలని మావోయిస్టు పార్టీ (Maoist Party) పిలుపునిచ్చింది.

AP | నేడు మావోయిస్టుల నిరసన దినం
X

దిశ, వెబ్ డెస్క్ : మారేడుమిల్లి (Maredumilli)అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లను ఖండిస్తూ నేడు నిరసన దినం పాటించాలని మావోయిస్టు పార్టీ (Maoist Party) పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఓ లేక విడుదలైంది. ఎన్ కౌంటర్లను ఖండిస్తూ మావోయిస్టులు నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులతో పాటు దండకారణ్యంలోని ఆంధ్రా, చత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో నిఘాను పెంచారు.

మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో అదనపు బలగాలతో పోలీసులు కూంబింగ్ ను ముమ్మరం చేశారు. ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్న మారేడుమిల్లితో పాటు రంపచోడవరం ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రంపచోడవరం, చింతూరు డివిజనుల్లోని రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు జాగ్రత్తగా ఉండాలని తమ నోటీసుల్లో పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రాత్రివేళ ఆర్టీసీ సర్వీసులు, వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. తెల్లవారుజాము నుంచి అనుమతిస్తున్నారు.

Next Story