- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP | పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
టీటీడీ పరకామణి కేసులో (TTD Parakamani Case) ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు (High Court) టీటీడీ ఆధునిక టెక్నాలజీ, కృత్రిమ మేధ వినియోగంపై వ్యాఖ్యనించింది.

దిశ, వెబ్ డెస్క్ : టీటీడీ పరకామణి కేసులో (TTD Parakamani Case) ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు (High Court) టీటీడీ ఆధునిక టెక్నాలజీ, కృత్రిమ మేధ వినియోగంపై వ్యాఖ్యనించింది. వాటిని వినియోగించాల్సిన అవసరం నొక్కి చెప్పింది. పరకామణిలో జరిగింది సాధారణ దొంగతనం కంటే తీవ్రమైన నేరంమని పేర్కొంది. ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. టీటీడీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు సమంజసం కావని హైకోర్టు అభిప్రాయపడింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సరైన బాధ్యత ఉండదంది. అందచేతనే పరకామణిలో చోరీకి ఆస్కారం ఏర్పడిందని వ్యాఖ్యనించింది. ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై ఆధారపడడం వల్ల భద్రతా లోపాలు తలెత్తుతాయని కోర్టు తెలిపింది.
ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేయాలి
విరాళాల లెక్కింపులో భక్తులను ఎందుకు భాగస్వాములు చేయొద్దని కోర్టు ప్రశ్నించింది. పారదర్శకతను పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అందుకోసం లెక్కింపు సమయంలో ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేయాలని తెలియజేసింది. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆగమ శాస్త్రం ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. విజిలెన్స్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. లెక్కింపు ప్రక్రియలో మానవ ప్రమేయాన్ని వీలైనంత వరకు తగ్గించాలని.. పూర్తి స్థాయిలో ఏఐ టెక్నాలజీని వినియోగించాలని టీటీడీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.






