కాళ్ల వాపు.. ఆసుపత్రికి లిక్కర్ స్కాం నిందితుడు

by Thanuru Gopichand |   (  Updated:2025-11-24 07:11:12  IST  )

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (CheviReddy Bhaskar Reddy) అస్వస్థకు గురయ్యారు.

కాళ్ల వాపు.. ఆసుపత్రికి లిక్కర్ స్కాం నిందితుడు
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (CheviReddy Bhaskar Reddy) అస్వస్థకు గురయ్యారు. లిక్కర్ స్కాంలో (Liquor Scam) నిందితుడుగా ఉన్న ఆయన ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. కాళ్ల వాపుతో బాధపడుతున్నానని భాస్కర్ రెడ్డి పోలీసులకు తెలిపారు. ఈ మేరకు వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించారు. చికిత్స అనంతరం భాస్కర్ రెడ్డిని తిరిగి జైలుకు తరలించనున్నారు. గతంలో జూన్ నెలలో కూడా ఆయన గుండె నొప్పిగా ఉందనడంతో పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సను అందించారు.

అయితే ఇటీవలే విజయవాడ ఏసీబీ కోర్టు కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, అనిల్ చోక్రా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, బూనేటి చాణక్యలకు డిసెంబర్ 5 వరకు రిమాండును పొడిగించింది.

Next Story