- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఊపిరిపీల్చుకున్న ఏపీ విద్యార్థులు.. ఇరాన్ నుంచి స్వదేశానికి రాక
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల(Indians)ను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధు’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ సింధు(Operation Sindhu )లో భాగంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh))కి చెందిన 10 మంది విద్యార్థులను(AP Students) ఇరాన్ నుంచి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య దాడుల నేపథ్యంలో తీవ్ర భయాందోళనలో ఉన్న ఏపీ విద్యార్థులు స్వదేశంలో అడుగుపెట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటివరకు సుమారు 1,750 మంది భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
విదేశాంగ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని ఇరాన్, ఇజ్రాయెల్(Israel) లో చిక్కుకున్న వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చింది. ఇరాన్(Iran), ఇజ్రాయెల్ నుంచి తిరిగి వస్తున్న భారతీయుల కోసం ఢిల్లీ(Delhi )లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వాలు(State Governments)) ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఢిల్లీలోని ఏపీ భవన్, తెలంగాణ భవన్‌లలో వీరికి వసతి సౌకర్యాలు కల్పించారు. ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపించేందుకు రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లు ప్రత్యేకంగా రెండు బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ బృందాలు విద్యార్థుల వారి ప్రయాణ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాయి.






