AP | భాగస్వామ్య సదస్సుకు స్టార్ హోటల్స్ సహకారం

by Thanuru Gopichand |

విశాఖలో ఈనెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టార్ హోటల్స్ అసోసియేషన్ (Star Hotels Association) పూర్తి సహకారం అందిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

AP | భాగస్వామ్య సదస్సుకు స్టార్  హోటల్స్ సహకారం
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖలో ఈనెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టార్ హోటల్స్ అసోసియేషన్ (Star Hotels Association) పూర్తి సహకారం అందిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. విజయవాడలో స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.వి.స్వామి అధ్యక్షతన తొలి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. హోటల్ పరిశ్రమ తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్.వి.స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాల (Tourist Places) అభివృద్ధితోపాటు అమరావతి ప్రాంతంలో అనేక హోటల్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం సహకరిస్తోందని వెల్లడించారు. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలకు మద్ధతు తెలిపేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు. టూరిజం రంగాన్ని ముఖ్యమంత్రి వేగంగా పరుగులు పెట్టిస్తున్నారన్నారు. నవంబరు 14, 15 తేదీల్లో జరిగే సీఐఐ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ మద్ధతు ప్రకటిస్తోందన్నారు. 34 దేశాల నుంచి ప్రతినిధులను ముఖ్యమంత్రి ప్రతినిధులను ఆహ్వానించారన్నారు. సమ్మిట్ వేదికగా రన్నింగ్ లో ఉన్న హోటల్స్ తో పాటు కొత్తగా నిర్మించనున్న హోటల్స్ ను ప్రమోషన్ చేసేందుకు ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. విశాఖపట్నంలో 30, తిరుపతిలో 12 వరకు, విజయవాడలో 12 ఇలా రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ హోటల్స్ ఉన్నాయన్నారు. అన్ని హోటల్స్ యాజమాన్యాలు కలిసి ప్రభుత్వానికి సహకరిస్తాయన్నారు. ముఖ్యమంత్రి మార్గదర్శనంలోనే పని చేస్తామని ప్రకటించారు.

Next Story