- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం... ఈ అంశాలపైనే చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ( Andhra Pradesh ) కేబినెట్ ( Cabinet) సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ( Andhra Pradesh ) కేబినెట్ ( Cabinet) సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Cm Chadrababu naidu) అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరగనుంది. ఇవాళ ఉదయం 11 గంటల సమయానికి సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. జూన్ 12వ నాటికి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ అంశంపై ప్రధానంగా.... చంద్రబాబు టీం చర్చించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అదే సమయంలో ఉద్యోగుల బదిలీలు, పలు సంస్థలకు భూ కేటాయింపుల విషయం, అమరావతి (Amaravati) పునర్నిర్మాణం అంశాలపై చర్చించబోతున్నారు. పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు ( Polavaram-Banakacharla Project ) అనుమతులపైన... కీలక చర్చ ఉంటుంది. ఎస్ ఐ పి బి సమావేశంలో ఆమోదించిన 19 ప్రాజెక్టులకు గాను 33 వేల కోట్ల పెట్టుబడులకు ఈ సందర్భంగా ఆమోదం తెలుపబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి అలాగే.. సంక్షేమ పథకాల అమలుపై కూడా చర్చ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఏపీలో ఫ్రీ బస్సు నిర్వహించబోతున్న ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో... ఆ పథకం మార్గదర్శకాలపై చర్చించి విడుదల చేసే ఛాన్సులు ఉన్నాయి.






