AP: డిసెంబరు నాటికి 13 జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు

by Thanuru Gopichand |

రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. మొంథా తుఫాను ప్రభావం కారణంగా దీనిపై చర్చ మరింత జోరుగా సాగుతోంది.

AP: డిసెంబరు నాటికి 13 జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు
X

దిశ, వెబ్ డెస్క్ : రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. మొంథా తుఫాను ప్రభావం కారణంగా దీనిపై చర్చ మరింత జోరుగా సాగుతోంది. తుఫాను ప్రభావాన్న అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆర్టీజీఎస్ కీలక పాత్రను పోషించారు. తద్వారా భారీ విపత్తు సమయంలోనూ ప్రాణ నష్టం నివారించడానికీ ఏపీ ప్రభుత్వానికి వీలుపడింది. సీఎం చంద్రబాబు నాయుడు సహా ఉన్నతాధికారులు, మంత్రులు ఆర్టీజీఎస్ టెక్నాలజీని వినియోగించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాలో ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను (Command Control Centre) ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

వచ్చే డిసెంబర్ నాటికి ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో 13 ఆర్టీజీఎస్ కమాండ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇవన్నీ కూడా ఒకే నమూనాలో ఉండి రాజధానిలో ప్రధాన కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానమై ఉంటాయి. జిల్లాల్లో ఏర్పాటు చేసే కేంద్రాల పర్యవేక్షణను ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. రాజధానిలో నిర్మించే కేంద్రం కోసం సచివాలయం వద్ద మల్టీ పర్పస్ భవన నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 750 సేవలను ప్రభుత్వం అందిస్తోంది. ద్వారా ఇస్రో సహకారంతో అవేర్‌ 2.0 వ్యవస్థ శాటిలైట్‌ సాయంతో వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే వీలుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల సమాచారం ఒకే చోట ఉండేలా డేటా లేక్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యకలాపాలు అన్నింటికి త్వరలో ఆర్టీజీఎస్‌ కేంద్ర బిందువు కానుంది.

Next Story