- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దావోస్ లో తనదైన ముద్ర వేయడానికి ఏపీ సిద్ధం
ప్రత్యేక వసతితో పెట్టుబడులకు ఆహ్వానం.

దిశ, వెబ్ డెస్క్ : స్విట్జర్లాండ్‌లోని దావోస్ (Davos) వేదికగా జనవరి 19 నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సులో ఏపీ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. గత ఏడాది తరహాలోనే "వన్ ఇండియా" (One India) కాన్సెప్ట్‌తో భారత్ తన ఉనికిని చాటుకుంటుండగా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ వంటి ఎనిమిది రాష్ట్రాలు 'ఇండియా పెవిలియన్'లో భాగంగా ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ప్రత్యేకంగా తనకంటూ ఒక 'ఏపీ లాంజ్'ను (AP Lounge) ఏర్పాటు చేసుకుని ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించనుంది. ఈ లాంజ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి సమావేశాలు, ప్యానెల్ చర్చలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా "వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్" వంటి వినూత్న అంశాలపై చర్చలు ఇక్కడ జరగనున్నాయి.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా సాగే ఈ పర్యటనలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కూడా కీలక భూమిక పోషించనున్నారు. ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ వంటి టెక్ దిగ్గజాలతో పాటు, ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ కాలిస్టా రెడ్‌మండ్, ఏపీ మోలర్-మారిస్క్ సీఈఓ విన్సెంట్ క్లెర్క్ వంటి ప్రముఖులతో సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) భేటీ కానున్నారు. అలాగే జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, పార్థ్ జిందాల్ అండ్ జాన్ కాకరిల్ గ్రూప్ సీఈఓ జీన్-లూక్ మౌరంగే కూడా ఏపీ లాంజ్‌లో ముఖ్యమంత్రితో చర్చలు జరపనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.






