- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకి కేటాయింపు.. రేసులో ఆ మహిళా నేత !
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానం విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయానికి వచ్చింది. ఈ రాజ్యసభ సీటు విషయంలో... టీడీపీ పార్టీ

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానం విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయానికి వచ్చింది. ఈ రాజ్యసభ సీటు విషయంలో... టీడీపీ పార్టీ అలాగే జనసేన రెండు కాంప్రమైజ్ అయ్యాయి. ఏపీ రాజ్యసభ స్థానం బిజెపికి ఇచ్చేందుకు... టిడిపి అలాగే జనసేన రెండు పార్టీలు అంగీకారం తెలిపాయి. దీంతో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం బిజెపికి కేటాయించారు.
ఈ మేరకు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో.. రాజ్యసభ అభ్యర్థి పై చర్చ జరిగింది. అమిత్ షా... నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు ను కిషన్ రెడ్డి కూడా కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభ స్థానంపై చర్చించారు అగ్ర నేతలు. చివరికి ఆ రాజ్యసభ స్థానాన్ని బిజెపికి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో బిజెపి పార్టీ నుంచి... ఆ రాజ్యసభ స్థానానికి ఎవరు ఫైనల్ అవుతారు అనే చర్చ మొదలైంది. రాజ్యసభ రేసులో తమిళనాడు మాజీ బిజెపి అధ్యక్షుడు అన్నామలై.. పేరు మొన్నటి నుంచి వినిపిస్తోంది. కొత్తగా ఈ రాజ్యసభ రేసులో మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఇది ఇలా ఉండగా... ఏప్రిల్ 15వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. నామినేషన్ దాఖలకు చివరి తేదీ ఏప్రిల్ 29 గా నిర్ణయించారు అధికారులు. ఇక 30వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు మే రెండవ తేదీ నిర్ణయించారు. మే 9వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. వైసిపి పార్టీ సీట్ల ప్రకారం వాళ్లకు అవకాశం లేదని తెలుస్తోంది. అంటే ఈ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.






