- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో రెండు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ్టి నుంచి వర్షాలు ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ్టి నుంచి వర్షాలు ఉన్నాయి. ట్రోపో ఆవరణంలో గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు చెట్ల కింద, పోలాల్లో ఉండకూడదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది వాతావరణ శాఖ. మరోవైపు అల్లూరి (జి) జికే వీధి మండలంలో తీవ్ర వడగాలులు, అలాగే ముంచింగిపుట్టు,పెదబయలు, గోకవరం, చింతూరు, కూన వరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో (07) వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. కాగా నిన్న అత్యధికంగా పోలవరం(జి) విఆర్ పురంలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అల్లూరి (జి) గంపరైలో 21.5మిమీ వర్షపాతం నమోదు అయింది.






