- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రజలకు అలర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నట్లు APSDMA హెచ్చరికలు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రాగల మూడు గంటల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది APSDMA. 40-50కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు అల్లూరి జిల్లా జికే వీధి, పోలవరం జిల్లా గుర్తేడు మండలాల్లో తీవ్ర వడగాలులు, అలాగే అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు మండలంలో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.






