AP POLYCET: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ రోజునే ఏపీ పాలీసెట్ పరీక్ష

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-21 03:11:24  IST  )

ఏపీ పాలీసెట్-2025 (AP POLYCET 2025) విషయంలో కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

AP POLYCET: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ రోజునే ఏపీ పాలీసెట్ పరీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పాలీసెట్-2025 (AP POLYCET 2025) విషయంలో కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 30న పరీక్ష నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 69 కో-ఆర్డినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. పాలీసెట్-2025 (POLYCET-2025) పరీక్షకు సుమారు 1.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దరఖాస్తు ఫీజు ఓసీ (OC)/బీసీ (BC) అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీలకు రూ.100గా నిర్ణయించారు. ఈ మేరకు పరీక్షకు అవసరమైన పూర్తి ఏర్పాటు చేయాలని సాంకేతిక విద్యాశాఖను ఆదేశిస్తూ గురువారం రాత్రి విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ (Kona Shasidhar) ఉత్తర్వులను జారీ చేశారు.

Next Story