BREAKING: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-16 12:25:00  IST  )

ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్ -2025) ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు.

BREAKING: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్ -2025) ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు 1,39,840 మంది విద్యార్థులు హాజరవ్వగా.. 1,33,358 మంది పాసైనట్లు తెలిపారు. అంటే 95.36 శాతం మంది పాలిసెట్ లో ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లోనూ బాలికల హవానే కొనసాగిందని మంత్రి పేర్కొన్నారు. 96.9 శాతం మంది బాలికలు పాలిసెట్ ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 98.66 శాతం మంది పాసవ్వగా.. 19 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించారని నారా లోకేష్ X లో పోస్ట్ చేశారు.

మీ పాలిసెట్ రిజల్ట్ తెలుసుకోవాలంటే https://polycetap.nic.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి.. ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ 2025పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఓపెన్ అయిన పేజీలో హాల్ టికెట్ నంబర్, డీటెయిల్స్ ను సబ్మిట్ చేయగానే మీ రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అక్కడే ర్యాంక్ కార్డ్ కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Next Story