నకిలీ మద్యానికి నలుగురు బలి.. సాక్షి యాజమాన్యానికి నోటీసులు జారీ

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో కల్తీ మద్యంపై సాక్షి దినపత్రిక అసత్య ప్రచారం చేస్తోందని పోలీసులు పేర్కొన్నారు.

నకిలీ మద్యానికి నలుగురు బలి.. సాక్షి యాజమాన్యానికి నోటీసులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కల్తీ మద్యంపై సాక్షి దినపత్రిక అసత్య ప్రచారం చేస్తోందని పోలీసులు పేర్కొన్నారు. అక్టోబర్ 8న సాక్షిలో "నకిలీ మద్యానికి నలుగురు బలి" పేరుతో ప్రచురితం చేసిన వార్తలో ఆధారాలను పేర్కొనలేదన్నారు. చనిపోయిన వ్యక్తులు మద్యం తాగినందువల్లే మరణించారనేందుకు ఆధారాలు చూపాలని పేర్కొంటూ.. సెక్షన్ 179 (1) ప్రకారం సాక్షి యాజమాన్యానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సాక్షి పత్రిక చీఫ్ ఎడిటర్ ధనుంజయరెడ్డి, నెల్లూరు జిల్లా సాక్షి బ్యూరో చీఫ్ చిలకా మస్తాన్ రెడ్డికి నోటీసులు పంపారు. కాగా.. ఆ వార్తలో.. పల్నాడు జిల్లాలో ఒకరు, సత్యసాయి జిల్లాలో ఒకరు, నెల్లూరులో ఇద్దరు నకిలీ మద్యం తాగినందువల్ల మరణించినట్లు రాశారు.

Next Story