Breaking: ఏపీపీఎస్సీ అక్రమాల కేసు: ధాత్రి మధు అరెస్ట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-06 06:39:53  IST  )

గత ప్రభుత్వ హయాంలోగ్రూప్​1 నిర్వహించారు. ఏపీపీఎస్సీ కార్యాలయం, మరో కేంద్రంలో సీసీ టీవీ కెమెరాల నిఘాలో మూల్యాంకనం చేశారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారి జాబితాను 2021 ఏప్రిల్​28న ప్రకటించారు. అయితే ఆ పరీక్షకు సంబంధించిన మూల్యాంకనాన్ని మరోసారి జగన్​ ప్రభుత్వం డిజిటల్​పద్ధతిలో చేయించింది.

Breaking: ఏపీపీఎస్సీ అక్రమాల కేసు: ధాత్రి మధు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్/ డైనమిక్ బ్యూరో: ఏపీపీఎస్సీ గ్రూప్ -1 (APPSC Group-1 Scam) అక్రమాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న క్యామ్ సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (Camsign) అనే సంస్థకు డైరెక్టర్ గా ఉన్న ధాత్రి మధు (పమిడికాలువ మధుసూదన్)ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూప్-1 మెయిన్స్ ఆన్సర్ షీట్స్ ముల్యాంకనంలో అక్రమాలకు పాల్పడినట్లుగా మధుపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతన్ని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి, విజయవాడకు తరలిస్తున్నారు. ఆన్సర్ షీట్ మూల్యాంకనాన్ని మాన్యువల్ గా కాదని డిజిటల్ మూల్యాంకనం చేసి రూ.1.14 కోట్లు తీసుకున్న కామ్ సైన్ కంపెనీ డైరెక్టర్లలో మధు కూడా ఒకడు. నిన్నటి నుంచి ఆయన ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు.. డిజిటల్ మూల్యాంకనానికి వాడిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధుసూదన్‌.. గత ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్​జగన్​కు అత్యంత సన్నిహితుడు అని చెబుతుంటారు.

అసలేంటి ఈ కేసు

గత ప్రభుత్వ హయాంలోగ్రూప్​1 నిర్వహించారు. ఏపీపీఎస్సీ కార్యాలయం, మరో కేంద్రంలో సీసీ టీవీ కెమెరాల నిఘాలో మూల్యాంకనం చేశారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారి జాబితాను 2021 ఏప్రిల్​28న ప్రకటించారు. అయితే ఆ పరీక్షకు సంబంధించిన మూల్యాంకనాన్ని మరోసారి జగన్​ ప్రభుత్వం డిజిటల్​పద్ధతిలో చేయించింది. ఇందుకోసం ‘కామ్ సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే ప్రైవేట్ కంపెనీకి జగన్‌ ప్రభుత్వం రూ.1.14 కోట్లు చెల్లించింది. కరోనా కారణంగా మరోసారి డిజిటల్ మూల్యాంకనం చేయించాల్సి వచ్చిందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ మూల్యాంకనంలో దాదాపు తొమ్మిది మందికి 74 మార్కులు రావడం అనుమానాలకు తావచ్చింది. కమిషన్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా కొందరికి 99శాతానికి పైగా మార్కులు వేసేశారని అప్పట్లో సంచలనం రేకెత్తించింది.

మరో కేసులో పీఎస్‌ఆర్​

ఇప్పుడు ముంబై నటి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్​అధికారి పీఎస్​ఆర్​ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నప్పుడే ఇదంతా జరిగింది. గ్రూప్‌-1 మూల్యాంకనం అక్రమాల్లో అసలు సూత్రధారి అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు కాగా, రెండో నిందితుడిగా మధుసూదన్‌పై ఇటీవల సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌కు వెళ్లిన బెజవాడ పోలీసులు బంజారా హిల్స్‌లోని పంచవటి కాలనీలో ఉన్న కార్యాలయంలో మధుసూదన్‌ను ప్రశ్నించారు. రిమాండ్​లో న్న పీఎస్​ఆర్​కు ఉచ్చు బిగుస్తున్నట్లు సమాచారం. మధును విచారణ చేపట్టిన తర్వాత, ఆయన వద్ద స్వాధీని చేసుకున్న ఎలక్ట్రానికి పరికరాలను విశ్లేషించిన తర్వాత ఈ కేసులో కూడా పీటీ వారెంట్​ద్వారా పీఎస్​ఆర్​ను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం లేకపోలేదు.

Next Story