- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హజ్‌కు 185 మంది ఏపీ యాత్రికులు
హైదరాబాద్ ఎంబార్కేషన్ కేంద్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 185 మంది యాత్రికులు సోమవారం హజ్ యాత్రకు బయలుదేరారు....

దిశ, ఏపీ బ్యూరో: హైదరాబాద్ ఎంబార్కేషన్ కేంద్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 185 మంది యాత్రికులు సోమవారం హజ్ యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా హాజీలను మైనారిటీ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడు ఎంఏ షరీఫ్ వీడ్కోలు పలికారు. విడిది కేంద్రం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మంత్రి ఫరూక్ జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం రెండు విమానాల్లో మొత్తం 185 మంది యాత్రికులు ప్రయాణించారు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో ఆధునిక సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్లు మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 1202 మంది యాత్రికులు హైదరాబాద్ ఎంబార్కేషన్ కేంద్రం ద్వారా హజ్‌కు వెళ్లనున్నారని, ఈ నెల 21వ తేదీ వరకు దశలవారీగా ప్రయాణాలు కొనసాగనున్నాయని ఆయన చెప్పారు. యాత్రికులకు విడిది, భోజనం, ప్రార్థన వసతులతో పాటు వైద్య శిబిరాలు, కరెన్సీ మార్పిడి, వీసా పత్రాల పరిశీలన, బోర్డింగ్ పాస్‌ల జారీ వంటి సేవలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లపై యాత్రికులు సంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక గత నెల 18, 19 తేదీల్లో విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి 333 మంది యాత్రికులు హజ్ యాత్రకు బయలుదేరిన విషయం తెలిసిందే.






