ఏపీ పీజీఈసెట్ -2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్ ఎప్పుడంటే..

by Naga Rani Yarlagadda |

ఏపీ పీజీఈసెట్ 2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.

ఏపీ పీజీఈసెట్ -2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్ ఎప్పుడంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పీజీఈసెట్ -2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా అధికారికంగా విడుదల చేశారు. ఫలితాల్లో పాసై.. అర్హత సాధించినవారికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో 26 కేంద్రాల్లో ఏప్రిల్ 28,29,30 తేదీల్లో ఆరు విడతల్లో జరిగిన APPGECET-2026కు 12,102 మంది దరఖాస్తులు చేసుకోగా.. 9,990 మంది విద్యార్థులు రాశారు. వీరిలో 9,320 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 93.29 శాతం ఉత్తీర్ణత నమోదయింది. 2026-27 విద్యాసంవత్సరంలో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించిన వారికి త్వరలోనే కౌన్సెలింగ్ ఆప్షన్లు ఇవ్వనున్నారు. కాగా అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/PGECET/PGECET/PGECET_GetRankCard.aspx తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేసి ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. GATE, GPAT ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులు ప్రవేశాలు కల్పించిన తర్వాత.. మిగిలిన సీట్లను PGECETలో అర్హత సాధించిన ర్యాంకర్లకు ఇస్తారు. కౌన్సెలింగ్ కోసం కావలసిన సర్టిఫికెట్లను అభ్యర్థులు సిద్ధం చేసుకుని ఉండాలని ఉన్నత విద్యామండలి సూచించింది.

Next Story