- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP PGCET 2025 : ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల
by Muthe.Rajitha |
ఏపీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025(AP PGCET 2025) ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025(AP PGCET 2025) ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) X ఖాతా వేదికగా విడుదల చేశారు. ఏపీపీజీసెట్ లో 88.60 శాతం మంది క్వాలిఫై అయ్యారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 9 నుంచి 12 వరకు జరిగిన ఈ పరీక్షల్లో 25,688 మంది విద్యార్థులు హాజరవగా.. 19,488 మంది ఉత్తీర్ణులు అయ్యారు.
ఈ ఫలితాలకు సంబంధించిన మార్కులు, ర్యాంక్ కార్డ్ కోసం https://cets.apsche.ap.gov.in/PGCET/PGCET/PGCET_GetRankCard.aspx వెబ్సైట్ ను సందర్శించాలని సెట్ ఛైర్మన్ డా. అప్పారావు, కన్వీనర్ డా.పీసీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఇక వీటికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ వచ్చేనెల నుంచి ప్రారంభం కానుంది.
Next Story






