- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబు అవినీతి కోట బద్దలవుతోంది: కాకాణి సంచలన వ్యాఖ్యలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ కాన్సెప్ట్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోందని, దీనిపై ప్రజల్లో ఇప్పటికే విస్తృత చర్చ మొదలైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు..

దిశ, వెబ్ డెస్క్: రాజధానిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) ప్రతిపాదించిన ‘మావిగన్’(Mavigan) కాన్సెప్ట్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోందని, దీనిపై ప్రజల్లో ఇప్పటికే విస్తృత చర్చ మొదలైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minsiter Kakani Govardenreddy) పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన విన్నప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu)లో వణుకు మొదలైందని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ ఆలోచనలతో తమ అవినీతి కోటలు ఎక్కడ బద్దలవుతాయో అన్న భయంతోనే, కూటమి ప్రభుత్వం మావిగన్‌పై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని కాకాణి మండిపడ్డారు.
జగన్‌ను ఎదుర్కోలేకనే..
జగన్‌ను ఎదుర్కోలేక వ్యక్తిగత దూషణలకు దిగాలని టీడీపీ ఎమ్మెల్యేలకు పైస్థాయి నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించారు. మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు దక్కించుకోవడానికి, తమ ర్యాంకింగ్స్ పెంచుకోవడానికే ఎమ్మెల్యేలు పోటీ పడి మరి జగన్‌ను తిడుతున్నారని విమర్శించారు. కేవలం పదవుల కోసం దిగజారి రాజకీయాలు చేయడం భావ్యం కాదని కాకాణి హితవు పలికారు. రాబోయే రోజుల్లో మహిళా లోకమే కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. జగన్‌కి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు.






