మహిళలను వ్యభిచార కూపంలోకి నెట్టబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ వన్: నారా లోకేశ్

by Seetharam |   (  Updated:2023-09-28 10:05:26  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు అత్యంత పేదరికంతో బాధపడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

Nara Lokesh
X

దిశ , డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు అత్యంత పేదరికంతో బాధపడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మహిళలు అనుభవిస్తున్న కష్టాలు తనను కదిలించి వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టబడుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉందని నారా లోకేశ్ వెల్లడించారు. వ్యభిచారం కారణంగా బాలికలు యుక్త వయసులోనే గర్భవతులు అవుతుండటం ఆందోళన కలిగిస్తోందని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై పోలీసులు దృష్టి సారించడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారని..మహిళల భద్రత వారికి పట్టదని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో సోదరీమణులకు తగిన భద్రత, గౌరవప్రదమైన జీవితాలను అందించడంలో సైకో జగన్ ప్రభుత్వం విఫలం అయ్యిందని చె్పుకొచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 15 నుంచి 19 మధ్య వయసున్న యువతులు గర్భం దాలుస్తున్న వివరాలతో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించిన వివరాలను నారా లోకేశ్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ జాబితాలో ఏపీలో 12.6 శాతం మంది టీనేజ్ యువతులు గర్భం దాలుస్తున్నట్టుగా ఉందని వెల్లడించారు. జాతీయ సరాసరి శాతం 6.8 శాతంగా ఉందని చెప్పుకొచ్చారు. దేశంలో 8.50 లక్షల మంది వ్యభిచార వృత్తిలో ఉంటే కేవలం ఏపీ నుంచే 1,33,447 మంది మహిళలు వ్యభిచారం చేస్తున్నారు అని నారా లోకేశ్ వెల్లడించారు.

Next Story