AP | ఇక ఉండదు భౌభౌల భయం

by Thanuru Gopichand |

ఇటీవల వీధి కుక్కల (Street Dogs) బెడద పెరిగిపోతోంది. వీధుల్లో నుంచి వెళ్లాలంటే కూడా చాలా మంది భయపడే పరిస్థితి నెలకొంది.

AP | ఇక ఉండదు భౌభౌల భయం
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల వీధి కుక్కల (Street Dogs) బెడద పెరిగిపోతోంది. వీధుల్లో నుంచి వెళ్లాలంటే కూడా చాలా మంది భయపడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వీధి కుక్కల బెడదను తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) నిర్ణయించింది. వాటి నియంత్రణకు తగు చర్యలను చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ మున్సిపల్ కమిషనర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని వీధి కుక్కల కోసం ప్రత్యేక ఆహార జోన్లను (Special Food zones) పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీధి కుక్కలకు సంతాన నియంత్రణ సర్జరీలు, రేబిస్ వ్యాక్సిన్ లను వేసే విషయాన్ని సీరియస్ గా తీసుకొంటున్నాం అన్నారు. అందుకోసం ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్లకు ముఖ్య కార్యదర్శి స్పష్టం చేశారు. ఇప్పటికే 2024 జూన్ 1 నాటికి పట్టణ స్థానిక సంస్థల్లో 2,24,732 కుక్కలకు సంతాన నిరోధక సర్జరీలు చేయించామని అధికారులు తెలిపారు. మరో 1.36 లక్షల కుక్కలకు ఈ సర్జరీలు చేయించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ల కోసం 45 చోట్ల ఆపరేషన్ థియేటర్లు, అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. 197 మంది శిక్షణ పొందిన సిబ్బందితో కుక్కలను పట్టుకుని సంరక్షించేందుకు అందుబాటులో ఉన్నారని వెల్లడించారు.

రేబిస్ సోకిన కుక్కలను గుర్తించి అవసరమైతే వాటిని ప్రత్యేక షెల్టర్లలో ఉంచాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్‌ నిర్ణయించారు. నగర పాలక సంస్థల్లో ఇటువంటి షెల్టర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా కుక్కల నియంత్రణ కోసం పట్టణ, నగర, రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా ప్రజలకు కుక్కుల నుంచి ప్రమాదం ఉండదని, కుక్కలకు కూడా సంరక్షణ లభిస్తుందని తెలిపారు.

Next Story