‘భారత్‌‌తో యుద్ధం చేసే సత్తా పాక్‌కు లేదు’.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-11 12:25:46  IST  )

వారం రోజుల నుంచి భారత్–పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.

‘భారత్‌‌తో యుద్ధం చేసే సత్తా పాక్‌కు లేదు’.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: వారం రోజుల నుంచి భారత్–పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్(India).. పాకిస్తాన్(Pakistan) ఉగ్రమూకల స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో పాక్ సైనికులు చేస్తున్న డ్రోన్స్, మిసైల్ దాడులను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది.

భారత్‌–పాక్ యుద్ధం పై ఏపీ(Andhra Pradesh) దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారయణ రెడ్డి(Minister Anam Ramanarayana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పాక్ తో జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వీరా జవాన్ మురళి నాయక్(Jawan Murali Nayak) కుటుంబానికి మంత్రి సానుభూతి తెలిపారు. ఇవాళ(ఆదివారం) నెల్లూరు జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.

ఈ క్రమంలో అక్కడి మీడియాతో మంత్రి ఆనం మాట్లాడుతూ.. భారత్‌తో యుద్ధం చేసే సత్తా పాకిస్తాన్‌కు లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అండగా చేసుకుని దాడులకు పాల్పడుతుందని విమర్శించారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు భారత్ సైన్యం దీటైన జవాబిచ్చిందన్నారు. తీవ్రవాదంతో రెచ్చిపోయి.. సింధూరం తుడిచేస్తే ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor)ను మహిళా శక్తి ముందుండి నడిపించిందన్నారు. భారతీయులంతా ఏకమై పాక్ ఉగ్రమూకలను, వారి విధానాలను తిప్పి కొడతారన్నారు.

Next Story