- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదు’.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు అభ్యంతరం చెప్పడం పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు.

దిశ,వెబ్‌డెస్క్: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు అభ్యంతరం చెప్పడం పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఆంధ్రప్రదేశ్‌కి(Andhra pradesh) రూ.లక్షల కోట్ల ఆదాయం తెచ్చే అక్షయపాత్ర అని తెలిపారు. దీనిపై రాజకీయాలు చేయవద్దని మంత్రి నిమ్మల హితవు పలికారు. ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో తెలంగాణకూ నీరు అందించే అవకాశం ఉంటుందన్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ(Telangana)కు ఏ రకంగానూ నష్టం ఉండదని మంత్రి నిమ్మల చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగం విధ్వంసానికి గురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో వైసీపీ(YSRCP) హయాంలో గాలేరు-నగరి ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. విజిలెన్స్ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మాణానికి అంచనాలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు అధికార మార్పిడి వైపు ఆలోచనలు చేయకుండా.. అభివృద్ధి వైపు చూడాలని మంత్రి నిమ్మల రామానాయుడు(Minister nimmala ramanaidu) సూచించారు.






