వేట్లపాలెం బ్లాస్ట్ బాధిత కుటుంబాలకు మంత్రుల పరామర్శ : చెక్కుల అందజేత

by Naga Rani Yarlagadda |

వేట్లపాలెం ప్రమాద బాధితులను రాష్ట్రమంత్రులు పరామర్శించారు.

వేట్లపాలెం బ్లాస్ట్ బాధిత కుటుంబాలకు మంత్రుల పరామర్శ : చెక్కుల అందజేత
X

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం జరిగిన భారీ పేలుడు ఘటనలో 21 మంది దుర్మరణం చెందారు. దీంతో వారి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మంత్రులు కందుల దుర్గేష్, నారాయణ, వాసంశెట్టి సుభాష్ హోంమంత్రి అనిత, అధికారులు ఆదివారం ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షలు (ఒక్కో కుటుంబానికి) చెక్కుల్ని అందజేశారు. అలాగే చనిపోయినవారు ఎప్పటి నుంచి ఆ బాణసంచా కేంద్రంలో పనులకు వెళ్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్నివిధాలా బాధితులను ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కూలిపనులు చేసుకుంటేకాని ఇల్లుగడవని పరిస్థితులని, పొట్టకూటికోసం పనులకు వెళ్తే ప్రాణాలమీదికి వచ్చిందని మంత్రుల ఎదుట బాధితులు వాపోయారు.

కాగా.. రాయవరం ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైందని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఇటీవల జరిగిన రాయవరం ఘటనతోనే పర్మిషన్లు, NOCలను మరింత కఠినతరం చేశామని, అధికారులను మూడునెలలకు ఒకసారి బాణసంచా తయారీకేంద్రాల్లో ఇన్ స్పెక్షన్ చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. కానీ బాణసంచా తయారీకేంద్రాలు పరిమితికి మించి కార్మికులను పనుల్లోకి తెచ్చుకుంటున్నారని, దీనివల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతోందన్నారు. ఇకపై ఇలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Next Story