చేవెళ్ల ఘటనపై ఏపీ మంత్రి సత్యకుమార్ సంతాపం

by Thanuru Gopichand |   (  Updated:2025-11-03 04:56:42  IST  )

ఏపీలోని కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి బస్సు అగ్ని ప్రమాదం మరువక ముందే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

చేవెళ్ల ఘటనపై ఏపీ మంత్రి సత్యకుమార్ సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి బస్సు అగ్ని ప్రమాదం మరువక ముందే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 21 మందికి పైగా మరణించారు. చేవెళ్ల (Chevella) మండలంలోని మీర్జాగూడలో జరిగిన ఈ హృదయవిదారక ఘటనపై ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satya Kumar Yadav) స్పందించారు. బాధితుల మరణం పట్ల ఆవేదనను వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రయాణికులు మరణించడం అత్యంత బాధాకరం అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులు బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

Read More.. మీర్జాగూడ బస్సు ప్రమాదం.. మృతులకు ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం

Next Story