- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను తగ్గిస్తాం : మంత్రి సత్యకుమార్
ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటోన్న మహిళల శాతం 50కు తగ్గిస్తామని ప్రకటన చేశారు సత్యకుమార్.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా స్థిరీకరణకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో సంతాన ఉత్పత్తి క్షీణిస్తున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి సత్య కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత జనాభా నియంత్రణ విధానానికి స్వస్తి పలికి నూతన ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటోన్న మహిళల శాతం 70గా ఉందన్నారు. అయితే దీనిని 50% తగ్గిస్తామని ప్రకటన చేశారు. సంతానోత్పత్తి రేటు పెంచడం కోసం చర్యలు తీసుకోబోతున్నట్లు వివరించారు. అటు మహిళా సాధికారతకు బలమైన పునాదులు వేయడమే లక్ష్యమన్నారు.
ఏపీలో 1.5కి పడిపోయిన సంతానోత్పత్తి రేటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, విపరీతమైన ఒత్తిడి, పర్యావరణం తది తర కారణాల వల్ల సంతాన ఉత్పత్తి రేటు క్రమక్రమంగా తగ్గిపోతుంది. ప్రస్తుతం ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.5కి క్షీణించింది. ఈ పర్సంటేజ్ ఇలాగే కొనసాగితే 2035 నాటికి, ఒక శాతానికి పడిపోయే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే జనాబా వృద్ధి రేటు 0.5కు పడిపోనుంది. ఈ క్రమంలోనే ఏపీలోని కూటమి సర్కార్.. సంతానోత్పత్తి రేటును పెంచాలని పదేపదే చెబుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా పలు కార్యక్రమాలలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక లేటెస్ట్ గా ఏపీ ఆరోగ్యశాఖ ఈ అంశం పైన ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు తగ్గిస్తామని ఏపీ మంత్రి సత్య కుమార్ వెల్లడించారు.






