- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Roja Selvamani: కర్ణాటకలో బీజేపీ ఓటమికి కారణం ఆయనే.. మంత్రి రోజా సంచలన ట్వీట్
ఏపీ మంత్రి రోజా స్పందించి టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్స్ వేశారు...

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో ఘన విజయం సాధించారు. అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోయింది. అయితే 60 స్థానాల్లో ఆధిక్యం చాటింది. ఇక కింగ్ మేకర్ అవుతారనుకున్న కుమార స్వామి 20 సీట్లకే పరిమితమయ్యారు. అయితే ఈ ఫలితాలపై ఏపీ మంత్రి రోజా స్పందించి టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్స్ వేశారు. కాంగ్రెస్‌ను చంద్రబాబు వదిలేశారని అందుకే కర్ణాటకలో ఆ పార్టీ గెలిచిందని, బీజేపీతో కలిసి పని చేయాలని అనుకుంటున్నారని అందుకే బీజేపీ ఓడిపోయిందని ఆమె విమర్శించారు. చంద్రబాబుతో కలిస్తే ఓటమి.. విడిపోతే విజయం ఇదే రాజకీయ సూత్రం అని రోజా ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ చూసిన కొందరు టీడీపీ నేతలు మంత్రి రోజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో రోజా వైసీపీలో చేరడంతో ఆ పార్టీ ఓటమి పాలైందని, ఈసారి ఎన్నికల్లో కూడా రోజా వల్లే వైసీపీ ఓడిపోబోతోందని విమర్శలు చేస్తున్నారు. మరి వీరి వ్యాఖ్యలకు రోజా స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:






