నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి.. మంత్రి నారాయణ అత్యవసర ఆదేశాలు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో వీధికుక్కల నివారణకు, వాటి సంతానోత్పత్తి నియంత్రణకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.

నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి.. మంత్రి నారాయణ అత్యవసర ఆదేశాలు
X

దిశ, వెబ్‌‌‌‌డెస్క్ : రాష్ట్రంలో వీధికుక్కల నివారణకు, వాటి సంతానోత్పత్తి నియంత్రణకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. వెంటనే స్టెరిలైజేషన్ చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. నిన్న విశాఖపట్నంలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ కమిషనర్లు, ఉన్నతాధికారులతో శనివారం ఎమర్జెన్సీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వేగంగా శస్త్రచికిత్సలు చేయించాలని సూచించారు. బాలుడికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రజల రక్షణే ధ్యేయంగా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.

Next Story