- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్‌కు థాంక్స్ చెప్పిన ఏపీ మంత్రి నారా లోకేష్.. ఎందుకంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కృతజ్ఞతలు చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం.. తెలుగు జాతి వెలుగు సంతకం.. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహా నాయకుడు ఎన్టీఆర్ స్మృతివనం అయిన ఎన్టీఆర్ ఘాట్‌కు రూ.1.35 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ మరమ్మతులు చేపట్టడం చాలా సంతోషం. ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) మరమ్మతులకు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని ట్వీట్‌లో నారా లోకేష్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. బనకచర్ల ప్రాజెక్ట్ అంశంలో రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రాజెక్ట్ అంశంలో ఇరు రాష్ట్రాల నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. ఎవరికి వారు వారి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బలంగా గొంతెత్తు్న్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఘాట్ అభివృద్ధిని నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి నారా లోకేష్ థాంక్స్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. బనకచర్ల అంశాన్ని కూడా ఇలాగే సామరస్యంగా పరిష్కరించుకోండి అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు






