హిందీ తప్పనిసరి అని ఎక్కడా చెప్పలేదు : ఎన్ఈపీపై లోకేష్ కీలక వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |

హిందీ తప్పనిసరి అని జాతీయ విద్యా విధానం (National Education Policy)లో ఎక్కడా చెప్పలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

హిందీ తప్పనిసరి అని ఎక్కడా చెప్పలేదు : ఎన్ఈపీపై లోకేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హిందీ తప్పనిసరి అని జాతీయ విద్యా విధానం (National Education Policy)లో ఎక్కడా చెప్పలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానంపై ఇండియా టుడే నిర్వహించిన సౌత్ కాంక్లేవ్ లో మాట్లాడిన లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ విద్యా విధానం కేవలం మూడు భాషలు నేర్చుకోవాలని మాత్రమే చెప్పిందని, హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని చెప్పలేదన్నారు. అయితే హిందీ నేర్చుకోవవడం మనకెంత ముఖ్యమో తనకు బాగా తెలుసని చెప్పారు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కలిసినపుడు మాతృభాషలో పాఠ్యాంశాల బోధనపై దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలిపారు.

తాను మూడు భాషలు నేర్చుకున్నట్లే.. తన కొడుకు దేవాన్ష్ కూడా మూడు భాషలను నేర్చుకుంటున్నాడని లోకేష్ పేర్కొన్నారు. నేటితరం పిల్లలు ఐదేసి భాషలు నేర్చుకుంటున్నారని, జర్మన్, జపనస్ ఇలా ఎన్నో భాషలున్నాయన్నారు. వీలైనన్ని భాషలు నేర్చుకుంటే.. ఆయా దేశాల్లో పనిచేసేందుకు వీలుంటుందన్నారు. చదువుపై రాజకీయ నిర్ణయాల ప్రభావం ఉండకూడదనేది తన అభిప్రాయంగా చెప్పారు.

ఇక బీజేపీతో పొత్తు గురించి మాట్లాడుతూ.. 2029 తర్వాత కూడా పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కే మద్దతిస్తామని తెలిపారు. అయితే.. ఇండియా కూటమి అభ్యర్థి అయిన సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి కదా.. ఆయనకు మద్దతు ఎందుకివ్వరని ప్రశ్నించగా.. భారత్ ఫస్ట్ అనేదే తమ పార్టీ నినాదమని చెప్పారు.

Next Story