జెన్ జీ యువతతో ఏపీ మంత్రి లోకేశ్ ఇంట్రెస్టింగ్ ర్యాపిడ్ ఫైర్.. వీడియో వైరల్

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

జెన్ జీ యువతతో ఏపీ మంత్రి లోకేశ్ ఇంట్రెస్టింగ్ ర్యాపిడ్ ఫైర్.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘అండర్ 18’ (The Under 18 World) జెన్ జీ (Gen Z) యువత కోసం నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు యువతులు అడిగిన పలు ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానాలిస్తూ ఆకట్టుకున్నారు.రాజకీయాలు, వ్యక్తిగత ఇష్టాలు, సినిమా ముచ్చట్లకు సంబంధించిన ఆ ఆసక్తికర ప్రశ్నలు, మంత్రి లోకేశ్ ఇచ్చిన సమాధానాలు చెప్పారు.

ర్యాపిడ్ ఫైర్ హైలైట్స్:

ప్రశ్న: హైదరాబాద్‌ లేదా అమరావతి.. ఈ రెండింటిలో దేనిని ఎంచుకుంటారు?

నారా లోకేశ్: అమరావతి

ప్రశ్న: పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఫస్ట్ షో ఏది చూస్తారు?

నారా లోకేశ్: రెండు సినిమాలు చూస్తాను (సమయస్ఫూర్తితో బదులిచ్చారు).

ప్రశ్న: హైదరాబాద్ బిర్యానీ లేదా రాగి సంగటి.. ఏది ఇష్టం?

నారా లోకేశ్: రాగి సంగటి

ప్రశ్న: చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో పీఎం (ప్రధానమంత్రి) అవుతారా? లేక ప్రెసిడెంట్ (రాష్ట్రపతి) అవుతారా?

నారా లోకేశ్: None of the Above (పైవేవీ కావు) అంటూ ఈ ప్రశ్నకు సమాధానాన్ని సున్నితంగా దాటవేశారు.

ప్రశ్న: వచ్చే 2029 ఎన్నికల్లో ఏం జరగబోతోంది?

నారా లోకేశ్: NDA (కూటమి) మళ్లీ భారీ విజయం సాధిస్తుంది.

సోషల్ మీడియాలో హల్‌చల్

సాధారణంగా రాజకీయ అంశాలతో బిజీగా ఉండే లోకేశ్, ఇలా సరికొత్తగా జెన్ జీ యువతతో కలిసి సరదాగా ముచ్చటించడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. యువత అడిగిన క్లిష్టమైన ప్రశ్నలకు కూడా ఆయన ఎంతో హుందాగా, చాకచక్యంగా సమాధానాలు చెప్పారంటూ ఈ వీడియోపై కామెంట్లు వస్తున్నాయి. కాగా, the under18world గ్రూప్‌లో యువత గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తదితర నేతలతో ఇంటర్వ్యూలు ఎంతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. అదే బాటలో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫుల్ వీడియో కోసం టీడీపీ అభిమానులు, కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు.

Next Story