- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి స్పందన
ముస్తాబాద్ మండలంలో గృహ వినియోగానికి కేటాయించిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై "ముస్తాబాద్‌లో సబ్సిడీ సిలిండర్ల దందా" శీర్షికతో దిశలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

దిశ, ముస్తాబాద్ : ముస్తాబాద్ మండలంలో గృహ వినియోగానికి కేటాయించిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై "ముస్తాబాద్‌లో సబ్సిడీ సిలిండర్ల దందా" శీర్షికతో దిశలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో సివిల్ సప్లై అధికారులు మండల కేంద్రంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండలంలోని పలు హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అధికారులు తనిఖీలు చేపట్టగా, గృహ వినియోగానికి మాత్రమే కేటాయించిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల సందర్భంగా సుమారు ఐదు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం చట్టవిరుద్ధమని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ముస్తాబాద్ మండలంలో సబ్సిడీ సిలిండర్ల దుర్వినియోగంపై ఇకపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, హోటళ్లు, బేకరీలు, ఇతర వాణిజ్య సంస్థల్లో నిరంతర తనిఖీలు నిర్వహిస్తామని సివిల్ సప్లై అధికారులు స్పష్టం చేశారు.
సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..
తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సబ్సిడీ సిలిండర్లు ఏ గ్యాస్ ఏజెన్సీ ద్వారా సరఫరా అయ్యాయి, నిబంధనలకు విరుద్ధంగా అవి వాణిజ్య సంస్థలకు ఎలా చేరాయి అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ముఖ్యంగా ఇండియన్ గ్యాస్‌కు చెందిన సబ్సిడీ సిలిండర్లు వాణిజ్య సంస్థల్లో ఉపయోగిస్తున్నట్లు సమాచారం ఉన్నందున, వాటి సరఫరా వివరాలను సేకరించి సంబంధిత ఏజెన్సీల పాత్రపై కూడా విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వారెవరైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సబ్సిడీ సిలిండర్ల అక్రమ వినియోగంపై దాడులు కొనసాగుతాయి: సివిల్ సప్లై అధికారులు
మండలంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు తదితర వాణిజ్య సంస్థల్లో గృహ వినియోగానికి కేటాయించిన సబ్సిడీ సిలిండర్లను వినియోగించరాదని అధికారులు సూచించారు. అక్రమ వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






