AP Mega DSc : ఏపీ మెగా డీఎస్సీకి అప్లై చేశారా..? ఇంకా ఒక్కరోజే ఛాన్స్

by Muthe.Rajitha |   (  Updated:2025-05-14 17:38:41  IST  )

ఏపీ మెగా డీఎస్సీ(AP Mega DSc)కి దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగియబోతోంది.

AP Mega DSc : ఏపీ మెగా డీఎస్సీకి అప్లై చేశారా..? ఇంకా ఒక్కరోజే ఛాన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మెగా డీఎస్సీ(AP Mega DSc)కి దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగియబోతోంది. మెగా డీఎస్సీ 2025 కింద 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా వీటికి సంబంధించిన దరఖాస్తు గడువు మే 15తో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ లో స్కూల్ అసిస్టెంట్స్ -7,725, సెకండరీ గ్రేడ్ టీచర్స్ -6,371, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ -1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ -286, ప్రిన్సిపల్స్ -52, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ -132, స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు ఉన్నాయి.

కాగా స్పోర్ట్స్ కోటా దరఖాస్తులకు మాత్రం మే 31 వరకు గడువు ఉంది. ఈ పోస్టులకు జూన్ 6 నుంచి జూలై 6, 2025 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరగనుంది. మే 20 నుంచి మాక్ టెస్టులు జరగనుండగా.. మే 30 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. చివరి రోజున సాంకేతిక సమస్యలు రాకుండా ముందుగానే దరఖాస్తు చేయాలని అభ్యర్థులకు సూచించారు.

Next Story