- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mega DSc : ఏపీ మెగా డీఎస్సీ.. తొలి రోజు పరీక్షలు ప్రశాంతం
ఏపీలో నేడు మెగా డీఎస్సీ(AP Mega DSc) ప్రారంభమైన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో నేడు మెగా డీఎస్సీ(AP Mega DSc) ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి(MV Krishna Reddy) పేర్కొన్నారు. జూన్ 6 నుంచి 30 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) రూపంలో జరగనున్న ఈ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా మొదటిరోజు 91 కేంద్రాల్లో 88 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించారు. కాగా ఈ మెగా డీఎస్సీలో 16,347 పోస్టులకు గాను 3,36,305 మంది అభ్యర్థులు 5,77,675 అప్లికేషన్స్ సమర్పించినట్టు తెలియజేశారు. ఈ పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT), స్కూల్ అసిస్టెంట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PET), ప్రిన్సిపల్ విభాగాలు ఉన్నాయి.






