అమెరికాలో ఆంధ్రావాసి మృతి.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విచారం

by Naga Rani Yarlagadda |

ఆంధ్రాకు చెందిన వ్యక్తి అమెరికాలో ప్రమాదవశాత్తు మరణించాడు. ఓ నదిలో ఈత కొడుతున్నసమయంలో ఈ ఘటన జరిగింది.

అమెరికాలో ఆంధ్రావాసి మృతి.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విచారం
X

దిశ, వెబ్‌డెస్క్ : విజయనగరం జిల్లాకు చెందిన ఇంజినీర్ అమెరికాలో మృతి మరణించారు. బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సాయిశ్రీ హరికృష్ణ నిన్న సాయంత్రం మరణించారు. MSC పూర్తిచేసి జనవరిలో ఎలిసెంట్ క్లీన్ టెక్నాలజీలో హరికృష్ణ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. కాగా.. నిన్న బర్త్ డే సెలబ్రేషన్స్ తర్వాత స్థానికంగా ఉన్న ఒక నదిలో ఈతకు వెళ్లి నదిలో మునిగి మరణించినట్లు ఆయన తండ్రి తెలిపారు. చిన్నవయసులోనే హరికృష్ణ మరణించడంపై రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తుందని తెలిపారు. కాగా.. హరికృష్ణ మరణవార్త అతని కుటుంబంలో విషాదాన్ని నింపింది. కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని గొప్పగా చెప్పుకుని మురిసిపోయిన తల్లిదండ్రులు.. ఇప్పుడు తీరని కడుపుశోకంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Next Story