AP: స్థానిక ఎన్నికలపై బిగ్ అప్‌‌డేట్.. హైకోర్టులో ఏజీ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో అడ్వొకేట్ జనరల్

AP: స్థానిక ఎన్నికలపై బిగ్ అప్‌‌డేట్.. హైకోర్టులో ఏజీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌‌ (Andhra Pradesh) లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు సర్కార్ కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో బీసీ జనగణన పూర్తి కాకుండా ఎన్నికలు నిర్వహించవద్దంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ (Advocate General Srinivas) ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు.

రాష్ట్రంలో బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై జరుగుతున్న సర్వే పూర్తి కావడానికి ఇంకా కనీసం నెల రోజులకు పైగా సమయం పడుతుందని ఏపీ ధర్మాసనానికి తెలిపారు. సర్వే నివేదిక అందిన తర్వాత, బీసీ కమిషన్ (BC Commission) రిజర్వేషన్లను శాస్త్రీయంగా నిర్ణయిస్తుందని, ఈ ప్రక్రియ ముగియకుండా ఎన్నికలకు వెళ్లబోమని స్పష్టం చేశారు. కోర్టుకు ఉన్న వేసవి సెలవుల లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వ వివరణతో ఏకీభవించిన హైకోర్టు, తదుపరి విచారణను జులై నెలకు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు జులై తర్వాతే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Next Story