- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Liquor Scam | నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ వాయిదా
ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణను వాయిదా వేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణను వాయిదా వేసింది. ఈ ముగ్గురు నిందితుల పిటిషన్లపై విచారణను వచ్చే నెల జనవరి 21వ తేదీకి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు మొదట్లో మంజూరు చేసిన 'డిఫాల్ట్ బెయిల్'ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల ప్రకారం లొంగిపోవాల్సిన గడువును సుప్రీంకోర్టు గతంలో నిలుపుదల చేస్తూ, నిందితులకు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
రిజాయిండర్‌కు సమయం కోరిన నిందితులు
తాజా విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లపై రిజాయిండర్ (Rejoinder) దాఖలు చేయడానికి నిందితుల తరపు న్యాయవాదులు కోర్టును మరింత సమయం కోరారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది.
కేసు నేపథ్యం
మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఎంవో కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టులో 'డిఫాల్ట్ బెయిల్' లభించింది. అయితే ఈ బెయిల్‌ను సవాలు చేస్తూ దర్యాప్తు సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన హైకోర్టు, ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేస్తూ నిందితులను లొంగిపోవాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్లపై లోతుగా విచారణ జరిపి, ఈ కేసు విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. తదుపరి విచారణ జనవరి 21న జరగనుంది.






