ఏపీ లిక్కర్ స్కాం కేసు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

by Malleboina Mahesh |

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో తనని అరెస్ట్ చేయగా.. తనకు ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ రాజ్ కసిరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఏపీ లిక్కర్ స్కాం కేసు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కాం కేసు (AP Liquor Scam Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో తనని అరెస్ట్ చేయగా.. తనకు ఏపీ సీఐడీ నోటీసులు (AP CID notices) ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy) సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. ఆయన పిటిషన్ లో తెలంగాణలో నివసిస్తున్న తనకు ఏపీకి చెందిన సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారని, తనకు నోటీసులు ఇచ్చే పరిధి ఏపీ సీఐడీకీ లేదని కోర్టులో సవాల్ చేశారు. కసిరెడ్డి పిటిషన్ (Kasireddy Petition)పై విచారించిన కోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు (Notices to the AP government) జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం, సిట్, ముఖేష్ కుమార్ మీనా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అనంతరం విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే లిక్కర్ స్కాం కేసు (Liquor scam case) లో రాజ్ కసిరెడ్డిని ఈ రోజు సిట్ అధికారులు తమ కష్టడిలోకి తీసుకున్నారు. విజయవాడ ప్రత్యేక న్యాయస్థానం అనుమతితో కసిరెడ్డిని విచారించనున్నారు. ఆయన ఈ రోజు నుంచి ఈ నెల 8 వరకు పోలీసుల కష్టడిలోనే ఉండనున్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో సిట్ అధికారులు కసిరెడ్డిని విచారించనున్నారు.

Next Story