ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. నిందితులకు మరోసారి రిమాండ్ పొడిగింపు

by Kema Shiva Kumar |

వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. నిందితులకు మరోసారి రిమాండ్ పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులకు విజయవాడ (Vijayawada) ఏసీబీ కోర్టు (ACB Court) జూన్‌ 3 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విధించిన రిమాండ్‌ గడువు ఇవాళ్టితో ముగియడంతో నిందితులను సిట్ (SIT) అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం వారి రిమాండ్‌ను పొడిగించింది. ప్రస్తుతం నిందితులు రాజ్‌ కేసిరెడ్డి, గోవిందప్ప బాలాజీ, చాణక్య, దిలీప్‌, సజ్జల శ్రీధర్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి విజయవాడలోని జిల్లా జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

కాగా, లిక్కర్ స్కామ్ కేసు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన సిట్ ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో అప్పటి సీఎంవో కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డి (Dhanunjay Reddy), జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి (Krishna Mohan Reddy), భారతి సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీ (Govidappa Balaji)లను సిట్‌ నిందితులుగా చేర్చింది. కేసు విచారణలో భాగంగా మూడు రోజుల పాటు ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డిని ప్రశ్నించిన సిట్ బృందం మే 16న అరెస్ట్ చేసింది. మే 17న నిందితులను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా వారికి 20 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసులో A33 నిందితుడుగా ఉన్న గోవిందప్పను ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.

Next Story