AP | మద్యం కుంభకోణం నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ

by Thanuru Gopichand |

మద్యం కుంభకోణంలో (Liquor Scam) నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసులో నిందితులైన ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ను హైకోర్టు (High Court) రద్దు చేసింది.

AP | మద్యం కుంభకోణం నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ
X

దిశ, వెబ్ డెస్క్ : మద్యం కుంభకోణంలో (Liquor Scam) నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసులో నిందితులైన ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ను హైకోర్టు (High Court) రద్దు చేసింది. వారి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ (CID) వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు అనుమతినిచ్చింది. నవంబరు 26లోపు నిందితులు జడ్జి ముందు సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా రెగ్యులర్ బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని నిందితులకు సూచించింది. ముగ్గురి బెయిల్ పిటిషన్లను విచారించాలని ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది.

అయితే మద్యం కుంభకోణంలో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా పని చేసిన ధనుంజయ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. సెప్టెంబరులో వీరికి ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ను మంజూరు చేసింది.

Next Story