- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijayawada: లిక్కర్ కేసు విచారణ వాయిదా
ఏపీ లిక్కర్ కేసు విచారణ వాయిదా పడింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ కేసు(AP Liquor Case) విచారణ వాయిదా పడింది. బెయిల్ ఇవ్వాలని నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ కోర్టు(Vijayawada Court)లో విచారణ జరిగింది. ఇరువార్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. కాగా మద్యం కేసు(Liquor Case)లో రాజ్ కసిరెడ్డితో పాటు ధనుంజయ్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితులను ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో కోర్టులో వాళ్ల తరపున పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. ఈ నెల 10న కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోననే ఉత్కంఠ నిందితుల్లో నెలకొంది.
Next Story






