లిక్కర్‌ కేసులో చెవిరెడ్డి బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా

by Vemula.Srinu Prasad |

విజయవాడ ACB కోర్టులో ఏపీ లిక్కర్‌ కేసు విచారణ జరిగింది....

లిక్కర్‌ కేసులో చెవిరెడ్డి బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ACB కోర్టులో ఏపీ లిక్కర్‌ కేసు(Ap Liquor Case) విచారణ జరిగింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగాలు ఉన్న చెవిరెడ్ది భాస్కర్ నాయుడు(Chevireddi Bhaskar Naidu), వైసీపీ నేత వెంకటేశ్ నాయుడు(YSRCP leader Venkatesh Naidu) బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. చెవిరెడ్డి పిటిషన్‌పై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఇక వెంకటేష్‌ నాయుడు బెయిల్‌పై విచారణను 16కు వాయిదా వేసింది. కాగా జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే మద్యం విక్రయాలు జరిపింది. అయితే మద్యం అమ్మకాలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేసును సిట్‌కు అప్పగించింది. ఈ కేసును విచారించిన సిట్ అధికారులు పలువురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇదే కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సైతం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం తమకు బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కోరుతున్నారు.

Next Story