- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ శాసనమండలిలో గందరగోళం.. లడ్డూపై చర్చ జరపాలని వైసీపీ నిరసన
ఏపీ శాసనమండలిలో మరోసారి గందరగోళం నెలకొంది. లడ్డూ అంశంపై చర్చ జరపాలని వైసీపీ సభ్యులు పట్టుపట్టారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ శాసనమండలిలో మరోసారి గందరగోళం నెలకొంది. లడ్డూ అంశంపై చర్చ జరపాలని వైసీపీ సభ్యులు పట్టుపట్టారు. వైసీపీ సభ్యులు పోడియం ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల తీరుపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. అవసరం అయితే 4,5 తేదీల్లో చర్చిద్దామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. దీంతో లడ్డూపై చర్చించేందుకు భయమెందుకు అని వైసీపీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సభ వాయిదా పడినా సభలోనే వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. వైసీపీ సభ్యుల ఆందోళనపై మండి చైర్మన్ మోషేన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదం షార్ట్ డిస్కర్షన్ సందర్భంగా సభ పున: ప్రారంభం అయినప్పుడు ప్రశ్నోత్తరాలు మళ్లీ మొదలు పెట్టాలనడం సరికాదన్నారు. మంత్రి పయ్యవుల కేశవ్ తనపై మాట్లాడిన వ్యాఖ్యలు అవాస్తవం అన్నారు. తాను సంతకం చేశానని చెప్పిన మాటలు కరెక్ట్ కాదని అన్నారు. అధికార, ప్రతిపక్షాలు సభ సజావుగా జరగటానికి సహకరించాలని కోరారు. మీరు రాజకీయాలు చేసుకోండి కానీ కుర్చీని అవమానించవద్దు అంటూ అసహనం వ్యక్తం చేశారు.






