- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM Modi : ఏపీ నాయకుల పనితీరు భేష్ : ప్రధాని మోడీ
విశాఖలో రేపు నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ(International Yoga Day) వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) పాల్గొననున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : విశాఖలో రేపు నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ(International Yoga Day) వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) పాల్గొననున్నారు. కొద్దిసేపటిక్రితం విశాఖ చేరుకున్న ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy Pawan Kalyan), కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భారత్, మంత్రి నారా లోకేష్ ముచ్చటించారు. ఈ సందర్భంగా.. రేపు ఏపీ వ్యాప్తంగా జరుపుతున్న యోగాంధ్ర 2025(Yogandhra) కార్యక్రమ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రపంచం అంతా ఏపీ వైపు చూసేలా చేశారని కూటమి నాయకులను అభినందించారు. ఏపీ నాయకుల పనితీరు భేష్ అని కొనియాడారు. కాగా రేపు ఆర్కే బీచ్ రోడ్డులో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం యోగాను ఉద్ధేశించి ప్రసంగిస్తారు. ఈ ఈవెంట్ ముగిసిన అనంతరం ఉదయం 11.50 గంటలకు ప్రధాని మోడీ తిరిగి ఢిల్లీకి పయనం అవుతారు.






