- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఇంటర్మీడియట్ 2025-26 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 10.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. ఫస్టియర్లో 77 శాతం మంది విద్యార్థులు (3,61,526) పాసవ్వగా.. సెకండియర్లో 81 శాతం మంది విద్యార్థులు (3,59,816) ఉత్తీర్ణులైనట్లు మంత్రి వెల్లడించారు. ఒకేషనల్ కోర్సులో ఫస్టియర్ స్టూడెంట్స్ 61 శాతం పాసవ్వగా.. సెకండియర్లో 74 శాతం పాసైనట్లు మంత్రి వివరించారు.
బాలురు, బాలికల వారిగా చూస్తే.. ఇంటర్ ఫస్టియర్లో 72 శాతం బాలురు పాసవ్వగా.. 81 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్లో బాలురు 76 శాతం పాసవ్వగా.. 85 శాతం మంది బాలికలు పాసయ్యారు. గడిచిన 12 ఏళ్లలో ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని మంత్రి అభినందించారు. విద్యార్థులు https://resultsbie.ap.gov.in వెబ్ సైట్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు. లేదా వాట్సప్ లో 9552300009 నంబర్ కు Hi అని మెసేజ్ చేసి, హాల్ టికెట్ నంబర్ ను పంపితే రిజల్ట్ నేరుగా వాట్సప్ కే వస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులు అధైర్యపడవద్దని సూచించారు. మరింత పట్టుదలతో శ్రమించి సప్లిమెంటరీలో మంచి మార్కులతో పాసవ్వాలని ఆకాంక్షించారు. ఈ సున్నితమైన సమయంలో విద్యార్థులకు తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు, మద్దతివ్వాలని విజ్ఞప్తి చేసింది.






